Thursday, April 25, 2024

రికార్డు స్థాయిలో ముగిసిన మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యలో ఒడిదుడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వంలో సూచిలు ముగింపు సమయంలో గరిష్ట స్థాయిలలో ముగిశాయి. చివరకు, సెన్సెక్స్ 277.41 పాయింట్లు (0.48%) పెరిగి 58,129.95 వద్ద ఉంటే, నిఫ్టీ 89.40 పాయింట్లు (0.52%) లాభపడి 17,323.60 వద్ద ముగిశాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.01 వద్ద నిలిచింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (4.12%), టైటాన్ కంపెనీ (2.59%), టాటా స్టీల్ (1.27%), బజాజ్ ఆటో (1.18%), మారుతి సుజుకి (1.06%).

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-1.18%), భారతి ఎయిర్ టెల్ (-1.17%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.85%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.68%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.67%).

ఇది కూడా చదవండి: నల్గొండ జిల్లాలో వర్షం బీభత్సం… రాకపోకలు బంద్

Advertisement

తాజా వార్తలు

Advertisement