Tuesday, April 13, 2021

కరోనా దెబ్బ… కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంతకేతాలకి తోడు,  దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ, లాక్‌డౌన్‌ కారణాలతో సోమవారం నాటి సెషన్ ఆరంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు కుప్పకూలాయి. సెన్సెక్స్‌  401 పాయింట్లు కోల్పోయి  49,638 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు కుప్పకూలి14,770 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్ట పోతున్నాయి. బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, ఐషర్‌  మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌, బజాజ్‌ఆటో, యాక్సిస్‌ బ్యాంకు భారీగా నష్టపోతున్నాయి. 

దేశంలో తొలిసారిగా రోజువారీ కరోనా కేసులు లక్ష మార్క్ ను అధిగమించడం ఇన్వెస్టర్లపై అమ్మకాల దిశగా ఒత్తిడి పెంచిందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. కేసులు పెరుగుతుండటంతో పాటు, లాక్ డౌన్ పరిస్థితులు మరోసారి ఏర్పడుతుండటం కూడా మార్కెట్ పై ప్రభావం చూపిందని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News