Friday, April 19, 2024

‘Mandous’ effect: నెల్లూరు జిల్లాను ముంచెత్తిన భారీ వర్షం.. నిండుకుండ‌లా జ‌లాశ‌యాలు..

నెల్లూరు జిల్లాలో మాండూస్‌ తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్‌ కారణంగా వెంకటగిరి, రాపూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెన్నా నదికి ఎగువ నుంచి వరద ప్రవాహం భారీగా పెరిగింది. అదేవిధంగా సోమశిల నుంచి 30 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. కండలేరు జలాశయం నిండుకుండలా మారింది. ఇవాళ, రేపు నెల్లూరు జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో అధికార బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement