Monday, March 25, 2024

నేడు నామినేషన్ వేయనున్న మంచు విష్ణు..

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల(Maa Elections 2021)కు సంబంధించిన నామినేషన్‌ల పర్వం కొనసాగుతోంది. ‘మా’ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకాశ్‌ రాజ్‌ నిన్న నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయనతో పాటు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ సభ్యులు కూడా నామినేషన్‌ వేశారు. ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాష్ రాజ్ అండ్ టీమ్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇక ఇవాళ మంచు విష్ణు ప్యానెల్ నామినేషన్ వేయనుంది. కాసేపట్లో నటుడు మంచు విష్ణు మరియు ప్యానెల్ సభ్యులు ‘మా’ ఎన్నికల కోసం నామినేషన్లు వేయనుంది. మా అధ్యక్ష, జనరల్ సెక్రెటరీ పదవులకు త్రిముఖ పోటీ నెలకొంది. జనరల్ సెక్రెటరీ పదవికి జీవిత, రఘుబాబు, బండ్ల గణేష్ పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సివియల్ నరసింహారావు పోటీ పడనున్నారు. అక్టోబర్ 10న జరుగనున్న మా ఎన్నికలు జరుగనున్నాయి.

ఇది కూడా చదవండి: ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ పర్యటన..

Advertisement

తాజా వార్తలు

Advertisement