Thursday, April 25, 2024

ప్రకాష్ రాజ్ మగాడైతే, దమ్ముంటే నన్ను ఎదుర్కోవాలి: మంచు విష్ణు

మా ఎన్నికల వ్యవహారం హాట్‌హాట్‌గా సాగుతోంది. తాజాగా మంచు విష్ణు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‌పై నిప్పులు చెరిగాడు. ‘మా’ ఎన్నికల వ్యవహారంలోకి తన కుటుంబాన్ని ఎందుకు తీసుకువస్తున్నారంటూ విష్ణు మండిపడ్డాడు. ప్రకాష్ రాజ్ మా ఇంటిని కూడా రెండుగా విభజిస్తున్నారని ఆరోపించారు. తన కుటుంబం పేరెత్తితే ప్రకాష్ రాజ్‌కు ఇక మర్యాద దక్కదని హెచ్చరించాడు. తన కోసం మా నాన్న, అక్క, తమ్ముడు ఓటు అడగుతారు… అందులో తప్పేంటి? అని మంచు విష్ణు ప్రశ్నించాడు.

అసలు నడిగర్ సంఘంలో అడిగితే ప్రకాష్ రాజ్ నిజస్వరూపం ఏంటో తెలుస్తుందని వ్యాఖ్యానించాడు. చిన్నా, పెద్దా అని చూడకుండా ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారని, పెద్దలను గౌరవించకపోతే సర్వనాశనం అవుతారని ఆగ్రహంతో ఊగిపోయాడు. ప్రకాష్ రాజ్ మగాడైతే, దమ్ముంటే నన్ను ధైర్యంగా ఎదుర్కోవాలి అంటూ విష్ణు సవాల్ విసిరారు. నేడు శ్రీహరి అంకుల్ మన మధ్యన ఉండుంటే ప్రకాష్ రాజ్ కు తగిన గుణపాఠం చెప్పేవారు అని పేర్కొన్నాడు.

మరోవైపు సీనియర్ నటి జీవితపైనా మంచు విష్ణు విరుచుకుపడ్డాడు. జీవిత గారూ… మరోసారి మా నాన్న పేరు ఎత్తవద్దు అని స్పష్టం చేశాడు. మోహన్ బాబు పేరెత్తే అర్హత జీవితకు లేదన్నాడు. సీనియర్ నటుడు శ్రీకాంత్ కు కూడా విష్ణు వార్నింగ్ ఇచ్చాడు. శ్రీకాంత్ గారూ… మీరు నోరెత్తితే బాగుండదని పేర్కొన్నాడు. ‘ఈ నెల 10 తర్వాత మనందరం ఒకరి ముఖం ఒకరం చూసుకోవాలి. ఈ నెల 11న ప్రకాష్ రాజ్ విమానం ఎక్కి వెళ్లిపోతారు. సినీ కుటుంబాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తారా? ఓ ముఠాగా ఏర్పడి ‘మా’ కుటుంబాన్ని చీల్చుతున్నారు. డ్రామాలు ఆడుతున్న ప్రకాశ్ రాజ్ కోసమే పేపర్ బ్యాలెట్‌తో ఎన్నికలు జరిపించాలని కోరాం. పోస్టల్ బ్యాలెట్ అంశంలో నా ప్రమేయం లేదు’ అని విష్ణు స్పష్టం చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement