Sunday, February 5, 2023

త‌న‌పై వ‌స్తున్న రూమ‌ర్స్ ని తెలివిగా వాడుకున్న మంచు మ‌నోజ్.. న్యూ మూవీ ఎనౌస్ మెంట్

జనవరి 18న హీరో మంచు మనోజ్ ఒక కీలక ప్రకటన చేయ‌నున్న‌ట్లు ట్వీట్ చేశారు. 20వ తేదీ 9:45 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేశాను. నా జీవితంలోని మరో అంకానికి సంబంధించిన స్పెషల్ న్యూస్ అన్నారు. జీవితము కాకరకాయ అంటుంటే పెళ్లి గురించే కాబోలు అనుకున్నారందరు. ఎటూ మౌనికతో వివాహం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వార్తే అనుకున్నారు. అనూహ్యంగా మనోజ్ కొత్త మూవీ ప్రకటన చేశారు. వాట్ ది ఫిష్ టైటిల్ తో అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేశారు. డెబ్యూ డైరెక్టర్ వరుణ్ కోరుకొండ వాట్ ది ఫిష్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సిక్స్ సినిమాస్, ఆ ఫిల్మ్ బై బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. డార్క్ కామెడీ, థ్రిల్లర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వాట్ ది ఫిష్ తెరకెక్కుతోందని సమాచారం. మొత్తంగా తనపై జరుగుతున్న ప్రచారాన్ని తెలివిగా వాడుకొని కొత్త మూవీ ప్రకటన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement