Saturday, April 20, 2024

మ‌నాలీలో ఏజెంట్ – హిట్ కొట్టేందుకు శ్ర‌మిస్తున్నాం-సురేంద‌ర్ రెడ్డి

ఏజెంట్ చిత్ర యూనిట్ తాజా షెడ్యూల్ ని మ‌నాలీలో ప్లాన్ చేసింది. ఈ చిత్రంలో హీరోగా అఖిల్ న‌టిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మనాలీలో అఖిల్ సహా చిత్ర యూనిట్ మనాలీలో ల్యాండ్ అయింది. ఆ విషయాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి ట్విట్టర్ లో వెల్లడించారు. ఈసారి హిట్ కొట్టేందుకు శ్రమిస్తున్నామని కామెంట్ చేశాడు. ఈ సినిమాలో మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం సమకూరుస్తున్నాడు. అనిల్ సుంకరతో కలిసి ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సినిమాను నిర్మిస్తోంది.మనాలీలో భయపెట్టించే యాక్షన్ ఎపిసోడ్స్ ను శరవేగంగా షూట్ చేస్తున్నామని వెల్లడించాడు. సినిమాను ఆగస్టు 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement