Saturday, April 20, 2024

కుటుంబంలో చిన్నగొడవ.. ఐదుగురి ప్రాణాలు తీసింది

భార్యభర్తల మధ్య మొదలైన చిన్నపాటి ఘర్షణ ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది. డెహ్రడూన్‌లోని రాణిఫోఖరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం ఘటన జరిగింది. 47 సంవత్సరాల మహేష్‌ తివారి భార్య, ముగ్గురు పిల్లలు, తల్లితో నివాసముంటున్నాడు. సోమవారం ఉదయం తన పిల్లలను స్కూలుకు తీసుకెళ్లే సమయంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో హడావుడిగా ఉన్న మహేష్‌.. భార్యకు దేవునికి పూజ తర్వాత చేయవచ్చు.. ముందు స్కూలుకు వెళ్లేందుకు టిఫిన్‌ రెడీ చేయమని చెప్పాడు. అదే సమయంలో గ్యాస్‌ కూడా అయిపోయింది. మరో సిలిండర్‌ను మార్చేందుకు వెళ్ళగా అదికూడా ఖాళీగా ఉంది. దీంతో మహేష్‌ తివారి ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు. నిరుద్యోగిగా .. అన్న ఉమేష్‌ స్పెయిన్‌లో ఉద్యోగం చేస్తూ తమ్ముడు కుటుంబ పోషణకు డబ్బు పంపిస్తూ ఉంటాడు.

దీంతో మహేష్‌ అన్న సంపాదనమీదే కాలం వెల్లదీస్తున్నాడు. ముందుగా నగ్గర్‌ ప్రాంతంలో నివాసముండే మహేష్‌ తన తండ్రి చనిపోవడంతో ఉమెష్‌ ఇంటిలోకి కుటుంబాన్ని మార్చారు. టిఫిన్‌ చేయమని చెప్పినా.. చేయకపోవడంతో కోపోద్రిక్తుడైన మహేష్‌ వంటరూములోని కత్తి తీసుకొని మొదట భార్య గొంతుపై బలంగా దాడిచేశాడు. అడ్డువచ్చిన కూతుర్లు అపర్ణ, స్వర్ణ, అనుపమలపై దాడి చేశాడు. అదేసమయంలో తల్లి బీతెన్‌ దీవీపై కూడా ఏమిచేస్తున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఒకే సమయంలో ఐదుగురిని విచక్షణారహితంగా దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. మహేష్‌ చాలా సెన్సిటివ్‌గా.. ఉండేవాడని సైకలాజికల్‌గా చాలా ఇబ్బందికి గురయ్యేవాడని సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ తెలిపారు. ఐదుగురి హత్యకు కారణమైన తాను ఏమీచేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇంటికి తాళం వేసుకొని లోపలే ఉండిపోయాడు. అప్పటివరకు ఇంటిలో కుటుంబ సభ్యుల చావుకేకలు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సమయంలో భయంభయంగా మహేష్‌ దాక్కున్నాడు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. పరిస్థితిని సమీక్షించారు. ఐదుగురి శవాలతో ఇంటినిండా రక్తపు మడుగులో కుటుంబ సభ్యులు చెల్లాచెదురుగా పడి ఉన్నారు. వెంటనే మహేష్‌ తివారిని అదుపులోనికి తీసుకొని హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బాండా జిల్లాకు చెందిన మహేష్‌కు 15 సంవత్సరాల క్రితం వివాహమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement