Thursday, April 25, 2024

ఇక పై పోర్న్ చూడను..ప్రకటించిన ఓ నెటిజన్..

రాత్రనక, పగలనక అశ్లీల వీడియోలను చూడనిదే రోజు గడవని ఓ వ్యక్తి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను ఒక అశ్లీల చిత్రాలను చూడనని..ఓ పోర్న్ సైట్ లో రాసుకొచ్చాడు. ఇక పై తాను ఆ సైట్ కు రిటైర్మెంట్ ప్రకటిచంనట్లు బహిరంగంగా పేర్కొన్నాడు. లిల్జిదబ్‌ అనే యూజర్‌ తనకు అందమైన, తెలివైన, ప్రేమగా చూసుకునే భాగస్వామి లభించిందని అందుకే తాను అశ్లీల సైట్‌కు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చాడు. ఈ సైట్‌లోని ఓ వీడియో కామెంట్స్‌ సెక్షన్‌లో లిల్జిదబ్‌ తన నిర్ణయాన్ని రాసుకొచ్చాడు. బాయ్స్‌..ఇక తాను ఇక్కడ అశ్లీల వీడియోలను వీక్షించనని, రిటైర్మెంట్‌ను ప్రకటించేందుకే ఇక్కడికి వచ్చానని, అధికారికంగా తనకు అన్నివిధాల జోడీగా సరైన తోడు దొరికింద’ని కామెంట్స్‌లో రాశాడు.

తనను అమితంగా ఇష్టపడే భాగస్వామిని మోసగించడం ఇష్టం లేకనే అశ్లీల సైట్‌కు దూరం కావాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇక ఎప్పటికైనా మీరు కూడా నేను చెప్పిన విషయాలను మీరు కనుగొంటారని ఆశిస్తున్నానని మిమ్మల్ని కోల్పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఈ పోస్ట్‌ స్క్రీన్‌షాట్‌ ట్విటర్‌లో వైరల్‌గా మారింది. నాలుగు లక్షలకు పైగావ్యూస్‌ రాగా,62,900కు పైగా లైక్స్‌ వచ్చాయి. కొందరు నెటిజన్లు అతడి నిర్ణయాన్ని సమర్ధించగా మరికొందరు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement