Friday, March 29, 2024

షారుఖ్ ఖాన్ ఇంటిని పేల్చేస్తామన్న వ్య‌క్తి అరెస్ట్

2022 జనవరి 6న జితేష్ మహారాష్ట్ర పోలీస్ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి, షారూఖ్ బంగ్లాను బాంబుతో పేల్చివేస్తానని చెప్పాడు. అయితే పోలీసులు షారుఖ్ ఖాన్ బంగ్లా మన్నత్ ను బాంబుతో పేల్చివేస్తానని బెదిరించిన వ్యక్తిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి పేరు జితేష్ ఠాకూర్. ఇందులో షారుక్ బంగ్లాతో పాటు ముంబైలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు, బాంబు పేలుళ్లు చేస్తామని బెదిరించాడు. ముంబై పోలీసులు కాల్‌ను ట్రేస్ చేసి, ఆ నంబర్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నుండి వచ్చిందని కనుగొన్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడు మద్యానికి బానిసైనాడని, గతంలో కూడా ఫేక్ కాల్స్ చేసి పోలీసు ఎస్‌ఓఎస్ సర్వీస్ డయల్ 100 ఉద్యోగులతో గొడవ పడ్డాడని తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement