Wednesday, March 27, 2024

ఖర్దాహా నుంచి బరిలోకి మమతా..?

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం తన ప్రత్యర్థి సువేందు చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. మమత ఓడినప్పటికీ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

బెంగాల్‌లో శాసనమండలి లేకపోవడంతో సీఎంగా కొనసాగాలంటే మాత్రం ఆమె ఆరు నెలల లోపు ఎమ్మెల్యేగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్న చర్చ మొదలైంది. పోటీలో నిలిచిన అభ్యర్థులు మరణించడంతో రాష్ట్రంలో మూడు చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఉత్తర 24 పరగాల జిల్లాలోని ఖర్దాహా స్థానానికి గత నెల 22న పోలింగ్ జరిగింది. ఆ స్థానం నుంచి బరిలోకి దిగిన టీఎంసీ అభ్యర్థి కాజల్ సిన్హా గెలుపొందారు. అయితే, కరోనా బారినపడిన ఆయన ఏప్రిల్ 25న మృతి చెందారు. అలాగే, జంగీపూర్ ఆర్ఎస్‌పీ అభ్యర్థి, శంషేర్‌గంజ్ కాంగ్రెస్ అభ్యర్థి మృతి చెందడంతో ఆ రెండు చోట్లా ఎన్నికలు వాయిదా పడ్డాయి. మొత్తంగా మూడు చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఇప్పుడు ఈ మూడు చోట్లలో ఏదో ఒక స్థానాన్ని మమత ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఖర్దాహా స్థానం నుంచి మమతా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement