Friday, May 7, 2021

మే 5న మమత, 7న స్టాలిన్ ప్రమాణ స్వీకారాలు

వరుసగా మూడోసారి బెంగాల్ పీఠం చేజిక్కించుకున్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మరోమారు సీఎం పగ్గాలు అందుకోనున్నారు. ఈ నెల 5న ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే టీఎంసీ శాసనసభాపక్ష నాయకురాలిగా మమతను ఎన్నుకున్నారు. ఈ క్రమంలో దీదీ సోమవారం రాత్రికి గవర్నర్ ను కలవనున్నారు. ఈ మేరకు టీఎంసీ నేత పార్థ ఛటర్జీ మీడియా సమావేశంలో వెల్లడించారు.

అటు తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకేకు భారీ విజయం అందించిన స్టాలిన్‌.. ఈ నెల 7న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్టాలిన్ తొలిసారిగా సీఎం పదవి చేపడుతున్నారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు స్టాలిన్‌ తెలిపారు. అటు, అన్నాడీఎంకే నేత పళనిస్వామి సీఎం పదవి నుంచి తప్పుకుంటూ రాజీనామా పత్రాన్ని గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌కు పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News