Friday, April 19, 2024

భారత పర్యాటకులపై మాల్దీవులు ప్రభుత్వం నిషేధం

భారత్‌లో తీవ్ర స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో మాల్దీవులు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే పర్యాటకులపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈనెల 13 నుంచి భారత్ నుంచి వచ్చే పర్యాటకులను తమ దేశంలోకి అనుమతించేది లేదని మాల్దీవులు ఇమ్మిగ్రేషన్ విభాగం ప్రకటించింది. కాగా మాల్దీవులు ప్రభుత్వ నిర్ణయంపై భారత హైకమిషన్ స్పందించింది. ఈ నిర్ణయం ఇరుదేశాల విమాన రాకపోకలపై ప్రభావం చూపే అవకాశముందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement