Tuesday, March 26, 2024

నకిలీ మద్యం తయారు దారులనను కఠినంగా శిక్షిస్తాం : శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఒడిశాలో అక్రమంగా తయారు చేసి రాష్ట్రంలో అమ్ముతున్న నకిలీ మద్యం రాకెట్‌ను గుట్టు రట్టు చేసిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ అధికారులను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అభినందించారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో సీజ్‌ చేసిన నకిలీ మద్యం పెట్టెలను, నకిలీ మద్యం తయారు చేసే యంత్రాలను మంత్రి పరిశీలించారు. సీఎం కేసీఆర్‌ అదేశాల మేరకు రాష్ట్రంలో నకిలీ మద్యం, గుడుంబా, గంజాయిలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు చర్యలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. నకిలీ మద్యం తయారు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఒడిశాలో తయారు చేసిన నకిలీ మద్యం , యంత్రాలను అత్యంత ధైర్యసాహసాలతో వెళ్లి స్వాధీనం చేసుకొని, నిందితులను అరెస్టు చేసిన అబ్కారీ శాఖ అధికారులను మంత్రి అభినందించారు.

ఇంకా దీనితో సంబంధం ఉన్న వారందరు నిందితులను గుర్తించి అరెస్టు చేయాలనన్నారు. సుమారు రూ. 2.50కోట్ల విలువైన మద్యం సీజ్‌ చేశారని తెలుసుకున్న ఆయన ఆయా మద్యాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో 10 మంది నిందితులను అరెస్టు చేసారన్నారు. విచారణ కొనసాగుతోందన్నారు. రాష్ట్ర ఖజానాకు నష్టం చేస్తున్న వారిపై కఠినంగా శిక్షించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు ఎక్సైజ్‌ అధికారులను మంత్రి సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement