Wednesday, April 24, 2024

మ‌హేష్ బాబు మాస్ స్ట్రైక్.. మంట రేపుతున్న “గుంటూరు కారం”

సూపర్ స్టార్ మహేష్ బాబు.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ క‌లిసి చేస్తున్న లేటెస్ట్ మూవీ SSMB 28. కాగా, ఈ మూవీకి గుంటూరు కారం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు మేక‌ర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ పాత్రలో కనిపించనున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ నుండి లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ గారి ఒకప్పటి సూపర్ డూపర్ హిట్ మూవీ మోసగాళ్లకు మోసగాడు నేడు రీ-రిలీజ్ సందర్భంగా పలు థియేటర్స్ లో టైటిల్ తో పాటు ఫస్ట్ మాస్ స్ట్రైక్ గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేసారు.

ఇక ఈ మాస్ స్ట్రైక్ లో మహేష్ బాబు లుక్స్, స్టైల్, స్వాగ్ తో పాటు గ్లింప్స్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే మైండ్ బ్లోయింగ్ రేంజ్ లో అదిరిపోయాయి. మొత్తంగా ఈ మాస్ స్ట్రైక్ గ్లింప్స్ ప్రస్తుతం సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుని యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళుతోంది. కాగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీని 2024 జనవరి 13న గ్రాండ్ లెవెల్లో విడుదల చేయనున్నారు మేకర్స్.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement