Friday, April 19, 2024

మహారాష్ట్ర, తమిళనాట ఆంక్షలు.. రెండు డోసులుంటేనే ఎంట్రీ..

ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో.. దేశంలోని పలు రాష్ట్రాలు ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి. ఇప్పటికే కర్నాటకా ప్రభుతం కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు డోసులు తీసుకోని పక్షంలో షాపింగ్‌ మాల్స్‌, సినిమా హాల్స్‌లో నో ఎంట్రీ విధించింది. అదే దారిలో మహారాష్ట్రతో పాటు తమిళనాడు చేరాయి. తమిళనాడులోని మధురై నగరంలో ఆంక్షలు విధించారు. టీకా తీసుకోని వారు వచ్చేవారం నుంచి బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా శనివారం ఆదేశాలు జారీ చేసింది.

మాల్స్‌, మార్కెట్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లతో సహా 18 ప్రదేశాలకు అనుమతి నిరాకరించింది. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చేలోపు ప్రజలు కనీసం ఒక్క డోసు టీకా అయినా వేయించుకోవాలని జిల్లా యంత్రాంగం సూచించింది. మధురై కలెక్టర్‌ అనీశ్‌ శేఖర్‌ మాట్లాడుతూ.. ప్రజలు కనీసం ఒక్క డోసు అయినా వేయించుకునేందుకు ఒక వారం సమయం ఇచ్చాం. ఆ గడువులోగా టీకా తీసుకోని వ్యక్తులు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఇతర వాణిజ్య సముదాయాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఉండదు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవే మార్గదర్శకాలు జారీ చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకుంటేనే.. మాల్స్‌, జిమ్‌, షాపింగ్‌ మాల్స్‌లో ఎంట్రీకి ప‌ర్మిష‌న్ ఇస్తున్న‌ట్టు తెలిపారు అధికారులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement