Saturday, April 20, 2024

‘మేఘా’ను అభినందించిన మహారాష్ట్ర సర్కార్ .. ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ సుబ్బయ్యకు ప్రశంస‌లు

మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్ట‌ర్స్‌ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) సంస్థను మహారాష్ట్ర ప్రభుత్వం అభినందించింది. ఆదివారం నాగ్‌పూర్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ సుబ్బయ్యకు ప్రశంసాపత్రాన్ని అందించారు. ఆదివారం నాగ్‌పూర్ లో పర్యటించిన ప్రధాని మోదీ హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్ ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌లోని రెండు ప్యాకేజీల ప‌నులు 85. 40 కిలోమీటర్లు ఎం ఈ ఐ ఎల్ చేపట్టి పూర్తి చేసింది. ఈ ఎక్స్‌ప్రెస్‌ రోడ్ నిర్మాణం వల్ల విద‌ర్భ‌, మ‌ర‌ఠ్వాడ‌, ఉత్త‌ర మ‌హ‌రాష్ట్ర అభివృద్ధికి ఆస్కారం కలుగుతుంది.

ఇక‌.. నాగ్‌పూర్ -ముంబై మధ్య ప్రయాణ సమయం ఏడు గంటలకు తగ్గుతుంది. ప్రస్తుతం నాగ్‌పూర్ నుంచి షిర్డీ వ‌ర‌కు ఎక్స్‌ప్రెస్‌వే మొద‌టి ద‌శ ప‌నులు పూర్తి అయ్యాయి. శివమడక నుండి నాగ్‌పూర్‌లోని ఖడ్కీ అమ్‌గావ్ వరకు 31 కి.మీ. ర‌హ‌దారి ప‌నులను మేఘా సంస్థ‌ చేపట్టి పూర్తి చేసింది. ఈ 31 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎం ఈ ఐ ఎల్ 18 మైనర్ బ్రిడ్జి, 3 ఇంటర్ ఛేంజ్‌లు, 3 ఫ్లైఓవర్, 2 వయాడక్ట్‌లు, 9 వెహికల్ అండర్‌పాస్ (VUP), 12 పాదచారుల అండర్‌పాస్ (PUP), 04 లైట్ వెహికల్ అండర్‌పాస్ (LVUP), 6 కాలువ వంతెనలు, 58 బాక్స్‌. కల్వర్టులు, 27 యుటిలిటీ కల్వర్టులు, 1 వైల్డ్ యానిమల్ ఓవర్‌పాస్. ఉన్నాయి.

కాగా, రెండో సెగ్మెంట్‌లో దాదాపు 54.40 కి.మీ రోడ్ ను ఎం ఈ ఐ ఎల్ పూర్తి చేసింది. ఔరంగాబాద్ జిల్లాలోని బెండేవాడి గ్రామం నుండి ఫతివాబాద్ వరకు రోడ్ ను ఎం ఈ ఐ ఎల్ నిర్మించింది. ఈ రహదారిపై 1 ప్రధాన వంతెన, 32 చిన్న వంతెనలు, ఒక సొరంగం , ఇంటర్‌చేంజ్‌ను మేఘా నిర్మించింది. 4 వయాడక్ట్, 69 బాక్స్ కల్వర్ట్లు , 26 వెహికిల్, లైట్ వెహికిల్ అండర్ పాస్ , 17 క్యాటిల్ అండర్‌పాస్, 1 వెహిక్యులర్ ఓవర్‌పాస్ (VOP), 1 వైల్డ్ యానిమల్ అండర్‌పాస్ 2 వైల్డ్ యానిమల్ ఓవర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది. దేశంలోనే గంటకు 150 కిమీ వేగంతో వాహనాలు ప్రయాణించేలా ఈ రోడ్ ను నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement