Friday, March 29, 2024

Smoking Shiva: పిచ్చి పీక్స్​కి చేరింది.. పెళ్లి ఫ్లెక్సీపై ‘స్మోకింగ్​ శివ’ ఫొటో!

జనాల పిచ్చి పీక్స్​కి చేరింది. స్మోకింగ్​ కాళీ పోస్టర్ల విషయంలో వివాదం ఇంకా చెలరేగుతూనే ఉంది. కాళికాదేవి సిగరెట్​ తాగుతున్నట్టు క్రియేట్​ చేసింది ఓ మహిళా దర్శకురాలు. దీనిపై వివాదం సద్దుమణగనేలేదు.. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో ఓ పెళ్లి జంట తమ ఫొటోతో పాటు స్మోకింగ్​ చేస్తున్న శివుడి ఫొటోని ఫ్లెక్సీలో వేయించారు. దీనిపై చాలామంది ఇప్పటికే మందలించినట్టు తెలుస్తోంది. అయితే హిందూ దేవుళ్లపై విపరీత పోకడలు పోతున్నారని, అవహేళన చేసేలా ఫొటోలను చిత్రీకరిస్తున్నారని.. దీనిపై సీరియస్​ యాక్షన్​ తీసుకోవాలని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement