Thursday, April 25, 2024

మూడు పాత్ర‌ల్లో సుధీర్ బాబు.. డీజే లుక్ రిలీజ్

మామా మ‌శ్చీంద్రా చిత్రంలో మూడు గెట‌ప్ప్ ల్లో మెర‌వ‌నున్నాడు హీరో సుధీర్ బాబు.తాజాగా మూడో పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. డీజేగా సుధీర్‌బాబు లుక్‌ అదిరిపోయింది. డీజే లుక్‌లో సుధీర్‌ అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఇక ఈ మూడు పాత్రలతో సినిమాపై ఎక్కడలేని హైప్‌ క్రియేట్‌ అయింది. ప్రముఖ కమెడియన్‌, అమృతం ఫేమ్‌ హర్షవర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబుకు జోడీగా ఈషా రెబ్బా, మృనాళిని రవి నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వరా సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై సునీల్‌ నారంగ్‌, పుస్కుర్ రామ్‌ మోహన్‌ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో సుధీర్‌ మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారు. రెండు పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లు ఇప్పటికే రిలీజ్‌ కాగా.. వాటికి విశేష స్పందన వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement