Wednesday, April 17, 2024

లైకా ప్రొడ‌క్ష‌న్ లో – ఐకాన్ స్టార్

భారీ చిత్రాల‌ను నిర్మించ‌డంలో ముందుంటుంది లైకా ప్రొడ‌క్ష‌న్స్. ఈ ప్రొడ‌క్ష‌న్ లో రోబో2.0 వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సంస్థే విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ , ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్ లో ఇండియ‌న్2 చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంస్థ నిర్మించే చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించ‌నున్నారట‌.. ఇటీవల అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ సినిమా తమిళ వెర్షన్ ను విడుదల చేసింది లైకావారే. ఇటు తమిళ .. మలయాళ భాషల్లోను .. అటు హిందీలోను ‘పుష్ప’ భారీ వసూళ్లను రాబట్టింది. అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ .. మార్కెట్ ఉందని గ్రహించిన లైకా వారు, ఆయనతో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా కోలీవుడ్ టాక్. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ ప్రాజెక్టు ఉంటుందట‌. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement