Friday, October 22, 2021

జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

జోగులాంబ గద్వాల జిల్లా ప‌రిధిలోని పిల్లిగుండ్ల ఆటో నగర్ వద్ద రైల్వే ట్రాక్‌పై ఓ ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య చేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుల‌ను అనంత‌పురం జిల్లాకు చెందిన గంగాధ‌ర్‌, ల‌క్ష్మీగా రైల్వే పోలీసులు గుర్తించారు. వీరిద్ద‌రూ ఇటీవ‌లే వివాహం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాల‌కు పోలీసులు స‌మాచారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News