Thursday, April 25, 2024

సెప్టెంబర్ 30న ‘లవ్‌స్టోరీ’ విడుదల?

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ మూవీ వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల కావడం లేదు. ఈ విషయం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా ఈ వార్త నిజమే. సెప్టెంబర్ 10న ఓటీటీలో నాని ‘టక్ జగదీష్’ మూవీ విడుదల అవుతుండటంతో ‘లవ్‌స్టోరీ’ సినిమా వెనక్కి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సెప్టెంబర్ 30న ఈ మూవీ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.

పవన్ సీహెచ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో పాటలు ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందాయి. ‘సారంగధరియా’ పాట కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతూనే ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవయాని, రావు రమేష్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రలను పోషించారు. నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు.

ఈ వార్త కూడా చదవండి: బిగ్ బాస్‌లో ఇండియన్ ఐడల్ విన్నర్

Advertisement

తాజా వార్తలు

Advertisement