Wednesday, June 16, 2021

నిజామాబాద్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

నిజామాబా‌ద్‌ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య ఘటన కలకలం సృష్టించింది. చందూరు మండలం లక్ష్మీపూర్‌ అటవీ ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఇద్దరి మృతదేహాలు కుళ్లిపోయాయి. మృతులను మోస్రా మండలం తిమ్మాపూర్‌కు చెందిన మోహన్‌, లక్ష్మిగా గుర్తించారు. ఇద్దరూ వారం రోజుల కిందటే ఆత్మహత్య చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Prabha News