Friday, March 29, 2024

జర్మనీలో మళ్లీ లాక్ డౌన్..?

కరోనా కేసులు తిరిగి విజృంభిస్తుండటంతో జర్మనీలో ప్రభుత్వం నింబధనలు కఠినతరం చేసింది. అంతేకాదు కేసుల తీవ్రత భారీగా పెరుగుతుండటంతో కొద్దికాలం పాటు లాక్‌డౌన్‌ విధించేందుకు ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్‌ నుంచి జర్మనీలో లాక్‌డౌన్‌ తరహా నియంత్రణలు అమల్లో ఉంది. అయితే గత కొద్ది వారాలుగా బ్రిటన్ లో‌ కరోనా‌ కేసుల పెరుగుదలను అదుపులోకి తీసుకురావడం సంక్లిష్టంగా మారింది. మార్చిలో మెర్కెల్‌ సహా పదహారు రాష్ట్రాల నేతలు పాల్గొన్న సమావేశంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కఠిన షట్‌డౌన్‌లు, కర్ఫ్యూ విధించాలనే అభిప్రాయం వెల్లడైంది. మరోవైపు కరోనా నియంత్రణకు మరిన్ని కఠిన చర్యలు చేపట్టేలా ఇన్ఫెక్షన్‌ ప్రొటెక్షన్‌ చట్టాన్ని సవరించేందుకు మెర్కెల్‌ సన్నద్ధమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement