Thursday, April 25, 2024

లాక్ డౌన్ ఎఫెక్ట్: సొంత రాష్ట్రాలకు వలస జీవులు..రైళ్లూ ఫుల్

తెలంగాణలో కరోనా లాక్‌డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఇక్కడి వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తరలిపోతున్నారు. ముఖ్యంగా బీహార్ వలస కార్మికులు పెద్ద ఎత్తున తిరుగు పయనమవుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం పది రోజులపాటు అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను మళ్లీ పొడిగిస్తారన్న వార్తలకు తోడు, ఉపాధి కరువవడంతో కార్మికులు సొంత రాష్ట్రాలకు తరలివెళ్లిపోతున్నారు. ఫలితంగా బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిశా వైపు వెళ్లే రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. వారం, పది రోజుల ముందే టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ దొరకడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం నడుస్తున్న సికింద్రాబాద్-దానాపూర్ రైలు రద్దీని తట్టుకోలేకపోతుండడంతో రైల్వే అధికారులు ఇటీవల మరో రైలు వేశారు. రెండు రైళ్లు ఉన్నా రద్దీ తగ్గకపోవడంతో నేడు మరో రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మూడు రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. నేటి రైలును ప్రకటించిన గంటలోనే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. నేడు బీహార్ వెళ్లనున్న మూడు రైళ్లలోనూ టికెట్లు అయిపోగా, ఇంకా 541 మంది వెయింటింగ్ లిస్టులో ఉండడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement