Tuesday, April 23, 2024

పోస్టు కొవిడ్‌ బాధితుల్లో కాలేయ వైఫల్యం, పెరుగుతున్న బాధితులు.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కొవిడ్‌ నుంచి కోలుకున్నాక గ్యాస్ట్రో (ఉదరకోశ) సంబంధిత సమస్యలతో వచ్చే రోగుల ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించాలని వైద్యు లకు డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది. పలు దేశాల్లోని పోస్టు కొవిడ్‌ బాధితుల్లో ముందుగా గ్యాస్ట్రో సమస్యలతో అనారోగ్యం మొదలై క్రమంగా కాలేయం (లివర్‌) వైఫల్యానికి దారితీస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉదరకోశ అనారోగ్య సమస్యలను తేలిగ్గా తీసుకోవద్దని వైద్యుల ను డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తం చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గినా పోస్టు కొవిడ్‌ వ్యాధులు చుట్టుముడు తూనే ఉన్నాయి. రోజుకో కొత్త రకం పోస్టు కొవిడ్‌ వ్యాధి వెలుగు చూస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఇప్పటి వరకు గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతోపాటు నీరసం, అలసట, కండరాల నొప్పుల, చిరాకు, మానిసక సమస్యలనే చూస్తున్నాం.

అయితే తాజాగా కొవిడ్‌ బారిన పడి కోలుకున్న వారిలో కాలేయ వైఫల్య సమస్యలు తీవ్రమవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) హెచ్చరించింది. కొవిడ్‌ బాధితుల్లో కాలేయ వైఫల్యం ముందుగా అన్న వాహిక (గొంతు) నొప్పితో ప్రారంభమై వేగంగా కాలేశయ పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని పేర్కొంది. ఈ అనారోగ్యానికి ఎడినో వైరస్‌ కారణంగా భావిస్తున్నట్లు పేర్కొంది. కాని ఆ వైరసే కారణమని నిర్ధిష్టంగా ఇప్పటి వరకు నిరూపణ కాలేదని కూడా తెలిపింది. ఈ తరహా కాలేయ అనారోగ్య కేసులు ప్రపంచంలోని 36దేశాల్లో నాలుగు నెలల వ్యవధిలోనే వెయ్యి కేసులు నమోదయ్యాయి. కాలేయ వ్యాధి బారిన పడుతున్న ప్రతి ముగ్గురిలో ఒకరు ఐసీయూలో చేరాల్సిన పరిస్థితులు ఎదురవుతుండగా, 5శాతం కేసుల్లో లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాల్సిన పరిస్థితులకు దారితీస్తున్నాయి. కాలేయ వ్యాధి బారిన పడిన వారిలో 2.5శాతం మంది ప్రాణాలు వదులుతున్నారు.

కొవిడ్‌ నుంచి కోలుకున్న బాధితుల్లో ముందుగా గ్యాస్ట్రో సమస్యలతో అనారోగ్యం ప్రారంభమై ఆ తర్వాత వాంచులు, డయేరియా లక్షణాలు బహిర్గతమై కొద్ది సమయంలోనే జాండిస్‌ (పసరికలు), మూత్ర సంబంధిత సమస్యలు, చర్మం, కళ్లు ఎల్లో కలర్‌లోకి మారిపోయి కాలేయ సమస్యలకు దారితీస్తోందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసపింది. తాజాగా కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో హెపటైటిస్‌ లేకున్నా కాలేయ వ్యాధులు దాడి చేస్తున్నాయి. అయితే కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత ఎడినో వైరస్‌ సోకుతుం డడంతో రోగనిరోధక శక్తి బాగా తగ్గడం కారణంగా లివర్‌ ఫెయిల్యూర్‌కు దారితీస్తోందని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement