Saturday, June 3, 2023

మార్చి 30న మద్యం దుకాణాలు, బార్‌లు బంద్..

ఈ నెల (మార్చి) 30న శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ లో మార్చి 30వ తేదీన మద్యం దుకాణాలు, బార్లు బంద్ చేయనున్నారు. ఫైవ్ స్టార్ హోటళ్లతో సహా బార్ రూమ్‌లు, వైన్ షాపులు, రిజిస్టర్డ్ క్లబ్‌లు, పబ్‌లను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -
   

మార్చి 30 ఉదయం 6 గంటల నుండి మార్చి 31 ఉదయం 6 గంటల వరకు దుకాణాలు మూసివేయబడతాయి. శాంతిభద్రతల దృష్ట్యా పండుగ సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement