Saturday, April 20, 2024

మందుబాబులకు శుభవార్త.. ఇకపై ఆఫర్లే ఆఫర్లు

కరోనా కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోతున్న నేపథ్యంలో కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే బీర్లపై రూ.10 తగ్గించిన ఎక్సైజ్ శాఖ బార్లలో మందకొడిగా వ్యాపారం సాగుతుండటంతో ఆఫర్లను ప్రకటించాలని బార్ల యాజమాన్యాలకు సూచించింది. వారానికి ఒకరోజు లిక్కర్ ఫ్రీ (ఉచితం) ఆఫర్‌ను ప్రకటించాలని ప్రతిపాదించింది. మరోవైపు కొన్నివారాల అనంతరం ఒకటి కొంటే మరొకటి ఉచితం ఆఫర్ ప్రవేశపెట్టాలని కూడా సూచించింది.

కరోనా కారణంగా బార్లకు రావడానికి కస్టమర్లు వెనుకంజ వేస్తున్నారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెకండ్ క్వార్టర్‌కు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించలేమని, దీన్ని మాఫీ చేయాలని కొన్ని బార్ల యజమానులు ఎక్సైజ్ శాఖకు వినతులు పంపడంతో ఆ శాఖ ఉన్నతాధికారి చర్చలు జరిపి పై ప్రతిపాదనలను బార్ల యాజమాన్యాల ముందు ఉంచారు. కాగా జనాభాకు అనుగుణంగా బార్లకు అడ్వాన్స్ ట్యాక్స్ విధానాన్ని ఎక్సైజ్ శాఖ రూపొందించింది. 50వేల కంటే తక్కువ జనాభా ఉన్న చోట ఏడాదికి రూ.30 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల లోపు జనాభా ఉన్న చోట ఏడాదికి రూ.42 లక్షలు, 20 లక్షలు ఉన్న చోట రూ.44 లక్షలు, 20 లక్షల కంటే ఎక్కువ ఉన్న చోట రూ.49 లక్షలు చొప్పున శ్లాబ్ రేట్లను గతంలో అధికారులు నిర్ణయించారు.

ఇది కూడా చదవండి: దేశంలో మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు

Advertisement

తాజా వార్తలు

Advertisement