Thursday, April 25, 2024

జూలో కరోనాతో సింహం మృతి

కరోనా వైరస్ మనుషులనే కాదు.. మూగ జీవులను వదలడం లేదు. తాజాగా జూ పార్క్‌లో కరోనాతో ఓ సింహం మృతి చెందడం కలకలం రేపింది. ఈ ఘటన తమిళనాడులోని వండలూర్ అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ లో చోటు చేసుకుంది. ఈ జూలాజికల్ పార్క్ లో మొత్తం 11 సింహాలు ఉండగా.. 9 సింహాలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. లాక్ డౌన్ కారణంగా గత నెల రోజులుగా జూలాజికల్ పార్క్ మూసి ఉన్నప్పటికీ వాటికి కరోనా సోకింది. జూలాజికల్ పార్క్‌లోని సఫారి ప్రాంతంలో ఉంచిన సింహం గురువారం సాయంత్రం 6.15 గంటలకు మరణించింది. అంత‌కుముందే క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో దాని నుంచి శాంపిల్ సేక‌రించి టెస్ట్ కోసం పంప‌గా.. అది పాజిటివ్‌గా తేలింది. చనిపోయిన సింహం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని.. కరోనాతో కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలతో అది చనిపోయి ఉండొచ్చని జూ అధికారి తెలిపారు. దీంతో మిగత సింహాలకు వైద్య చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. సింహలకు క‌రోనా ఎలా సోకింద‌న్న దానిపై అధికారులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

కాగా, కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ జూ పార్క్‌లోని సింహాలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా హైదరాబాద్ జూ పార్క్‌లోని సింహాలకు ఎలాంటి హానీ జరగకపోవడంతో అంతా ఊపరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement