Saturday, October 12, 2024

కోటికి.. న్యూసౌత్ వేల్స్ పార్ల‌మెంట్ లో జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం..

తెలుగు సినిమా సంగీతానికి చేసిన సేవల‌కి గుర్తింపుగా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటి.. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారి సంగీత దర్శకుడికి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు పాటల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన కోటి. మన అభిమాన హీరోల సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించి, మన పెదవుల్లో పాటలా, మన గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సాలూరి రాజేశ్వరరావు గారి అబ్బాయి కోటిగా మన అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సాలూరి కోటేశ్వర రావు ఈ అవార్డు అందుకున్నారు. ఇది తెలుగు సినిమా పాటకి జరిగే పట్టాభిషేకం, ఆ పాటకి ప్రాణం పోసిన సంగీతానికి కలిగే అరుదైన అవకాశం అని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా ఇండియన్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సొసైటీ ఆస్ట్రేలియాలోని పార్లమెంట్ లో కోటి ఈ పుర‌స్కారాన్ని అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement