Saturday, April 20, 2024

ఉక్రెయిన్‌-రష్యా మధ్య శాంతిని నెలకొల్పుదాం.. మోడీకి బోరిస్‌ జాన్సన్‌ ఫోన్‌

ఉక్రెయిన్‌లో శాంతి కోసం కలిసి పని చేద్దామని భారత్‌ ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ నిర్ణయించుకున్నారు. బుధవారం ఇరువురు నేతలు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం సమాచారం ఇచ్చింది. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్టు తెలిపింది. ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య శత్రుత్వాన్ని అంతం చేసి.. దౌత్య మార్గానికి తిరిగి రావాలని ఇద్దరు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు భారత్‌ నిరంతర కట్టుబడి ఉందని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. సమకాలిన ప్రపంచ వ్యవస్థకు ప్రాతిపదికగా.. అంతర్జాతీయ చట్టం అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారంపై భారతదేశానికి ఉన్న నమ్మకాన్ని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ఇరువురు నేతలు.. వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంచుకునే సామర్థ్యాన్ని అంగీకరించారు. దైపాక్షిక సేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు సానుకూలంగా సాగడం పట్ల ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది ఇద్దరు నేతలు మధ్య జరిగిన వర్చువల్‌ సమ్మిట్‌ సందర్భంగా ఆమోదించిన ఇండియా యూకే రోడ్‌ మ్యాప్‌ 2030 అమలులో సాధించిన పురోగతిని కూడా ఆయన అభినందించారు. ప్రధాన మంత్రి జాన్సన్‌ను తరలో భారత్‌ పర్యటనకు మోడీ ఆహానించినట్టు సమాచారం. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement