Friday, April 26, 2024

రాజ్యసభకు లక్ష్మణ్ ఏకగ్రీవం, యూపీ నుంచి ఎన్నిక.. అధికారిక ప్రకటనే తరువాయి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ను రాజ్యసభ సభ్యుడి పదవి వరించింది. మంగళవారం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తన వెంట రాగా లక్నోలో ఆయన నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో 11 స్థానాలు ఉత్తప్రదేశ్‌ నుంచే ఉన్నాయి. యూపీ అసెంబ్లిdలోని పార్టీల సంఖ్యా బలాన్ని అనుసరించి 7 స్థానాలను బీజేపీ సునాయాసంగా గెలుచుకునే అవకాశముంది. 3 స్థానాల్లో ప్రతిపక్షాలకు గెలిచే అవకాశముండగా, మరో స్థానానికి మాత్రం పోటీ నెలకొనే అవకాశం తలెత్తింది. అయితే ఎనిమిదో అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్‌ లక్ష్మణ్‌, ప్రతిపక్షాల నుంచి పోటీ లేకపోవడంతో రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌ నుంచి జీవీఎల్‌ నరసింహారావు బీజేపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. లోక్‌సభకు తెలంగాణ నుంచి నలుగురిని ప్రజలు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటేసి గెలిపించగా, పార్టీ పెద్దల సభలో మరొకరికి అవకాశం కల్పించి సంఖ్యాబలాన్ని మరింత పెంచింది.

టార్గెట్‌ తెలంగాణ
ఇప్పటికే బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా ఉన్న డా. కె.లక్ష్మణ్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా కాషాయదళం అగ్రనేతలు తమ ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. తమ తదుపరి టార్గెట్‌ తెలంగాణ రాష్ట్రమే అని చెప్పకనే చెప్పారు. లక్ష్మణ్‌కు అవకాశం కల్పించడం ద్వారా వెనుకబడిన వర్గాలకు తాము ప్రాధాన్యతను ఇస్తున్నామనే సంకేతాలతో పాటు కాపు ఓటుబ్యాంకుపై కూడా గురిపెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులుగా కాపు సామాజికవర్గం నుంచే ఉన్నారు. అయితే డా.లక్ష్మణ్‌ విషయంలో తన సామాజికవర్గం కంటే ఆయన పార్టీ కోసం ఇన్నేళ్లుగా చేసిన కృషిని గుర్తించారని చెప్పవచ్చు. విద్యార్థి దశ నుంచే ఏబీవీపీ నాయకుడిగా ఉన్న లక్ష్మణ్‌ పార్టీ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నారు. #హదరాబాద్‌ నగర కార్యదర్శిగా, బీజేపీ శాసనసభాపక్ష నేతగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన ఆయన తెలంగాణాలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అలాంటి వ్యక్తికి ఈ మధ్యనే ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించి, దేశవ్యాప్తంగా ఓబీసీ ఓటుబ్యాంకును సమీకృతం చేసే బాధ్యతను అధిష్టానం అప్పగించింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఓబీసీల మద్ధతుతో అధికారం చేపట్టాలని భావిస్తున్న కమలనాథులు, ఆ క్రమంలో ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడికి పెద్దల సభలో చోటు కల్పించారు.

హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో గట్టి పట్టున్న బీజేపీ, 2024లో మళ్లిd అధికారం చేపట్టాలంటే దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లో తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో దక్షిణాదిలో కర్నాటక తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ప్రస్తుతం బలం పెరుగుతూ వస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అనూ#హ్యంగా నాలుగు స్థానాలు గెలుపొందింది. ఆ తర్వాత దుబ్బాక, #హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లోనూ సత్తా చాటింది. ఈ ఉత్సా#హంతో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుపొందాలని ప్రణాళికలు రచిస్తోంది. అందుకు వీలు కల్పించేలా తెలంగాణలో నాయకత్వాన్ని బలోపేతం చేస్తోంది. రాష్ట్ర నాయకత్వంలో తొలిసారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించగా, కిషన్‌ రెడ్డిని సహాయ మంత్రి నుంచి కేబినెట్‌ ర్యాంక్‌కు పదోన్నతి కల్పించింది. అలాగే పార్టీలో కొత్తగా చేరినప్పటికీ, డీకే అరుణను ఏకంగా జాతీయ ఉపాధ్యక్షురాలిని చేస్తూ బాధ్యతలు అప్పగించింది. ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా డా.లక్ష్మణ్‌ను పెద్దల సభకు ఎంపిక చేసి రాష్ట్ర నాయకత్వాన్ని బలోపేతం చేసింది. మరోవైపు క్షేత్రస్థాయిలోనూ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే కసరత్తును కొనసాగిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement