Saturday, April 1, 2023

లాసెట్‌ అడ్మిషన్‌ షెడ్యూల్‌ విడుదల

అమరావతి,ఆంధ్రప్రభ: లాసెట్‌ 2022 అడ్మిషన్‌ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మంగళవారం విడుదల చేసింది. ఈనెల 28 నుండి 30 తారీఖులలోపు వెబ్‌ అప్షన్లను నిర్వహిస్తారు. 31వ తేదీన వెబ్‌ అప్షన్ల మార్పులను కోరతారు. జనవరి రెండో తేదీన సీట్లను కేటాయిస్తారు. మూడు నుండి ఏడు తేదీల్లోపు సీట్లు పొందిన విద్యార్ధులు కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. నాలుగో తేదీ నుండి క్లాసులు ప్రారంభమౌతాయి. ఈమేరుకు మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement