Thursday, April 25, 2024

META | ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్‌ అప్‌డేట్స్‌.. యూజర్ల కోసం సరికొత్త ఫీచర్స్

ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు నిత్యం సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. రీల్స్, ఫీడ్, స్టోరీస్‌, DMలతో సహా యాప్‌లోని వివిధ భాగాలలో తమను తాము క్రియేటివ్‌గా వ్యక్తీకరించడం, టీనేజ్, క్రియేటర్లను ప్రోత్సహించడమే ఇన్‌స్టాగ్రామ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కొద్ది నెలల క్రితం షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్‌ అయిన రీల్స్ ను పరిచయం చేసింది. ఈ రీల్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు అందిస్తూ దానిని ఉత్తమంగా తీర్చిదిద్దుతోంది. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్‌లో భాగంగా రీల్స్ కోసం కొత్త ఎడిటింగ్ ఫీచర్లను ఆఫర్ చేసింది. యూజర్లు రీల్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కొత్త ఎడిటింగ్ ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు. తద్వారా మరింత ఆకర్షణీయమైన, క్రియేటివ్ వీడియోలు చేయవచ్చు. రీల్స్ అప్‌డేట్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ ఇండియాలో గిఫ్ట్స్ ఫీచర్‌ను కూడా లాంచ్ చేసింది.

గిఫ్ట్స్ ఫీచర్

ఇన్‌స్టాగ్రామ్‌లో గిఫ్ట్స్ ఫీచర్ క్రియేటర్లు యాప్‌లోనే నేరుగా వారి ఫాలోవర్ల నుంచి గిఫ్ట్స్ స్వీకరించడానికి అనుమతిస్తుంది. ఫ్యాన్స్ స్టార్లను కొనుగోలు చేసి వారి ఫేవరెట్ క్రియేటర్లకు వాటిని గిఫ్ట్స్‌గా పంపించవచ్చు. రీల్స్‌లో ఫ్యాన్స్‌ నుంచి అందుకున్న ప్రతి స్టార్‌కి, ఇన్‌స్టాగ్రామ్ $0.01 ఆదాయ వాటాతో క్రియేటర్స్‌కి అందిస్తుంది. మరికొద్ది వారాల్లో గిఫ్ట్స్‌ ఫీచర్ క్రమంగా భారతదేశంలో అందుబాటులోకి వస్తుంది. దీంతోపాటు ఇన్‌స్టాగ్రామ్ తన రీల్స్ ఎడిటర్‌కు ప్రపంచవ్యాప్తంగా కొత్త ఫీచర్లు విడుదల చేయాలని యోచిస్తోంది. మెరుగైన ఎడిటింగ్ సామర్థ్యాలతో వీడియోలను గొప్పగా క్రియేట్ చేయడానికి ఈ ఎడిటింగ్ ఫీచర్లు పనికొస్తాయి.

- Advertisement -

ఎడిటింగ్ ఫీచర్లు

ఇన్‌స్టాగ్రామ్ అప్‌కమింగ్ అప్‌డేట్‌లో స్ప్లిట్, స్పీడ్, రీప్లేస్ వంటి ఎడిటింగ్ ఫీచర్లు ఉన్నాయి. స్ప్లిట్‌తో యూజర్లు ఒకే క్లిప్‌ను రెండు వేర్వేరు క్లిప్‌లుగా విభజించవచ్చు. స్పీడ్ ఫీచర్ యూజర్లు వారి క్లిప్‌ల వేగాన్ని అడ్జస్ట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఆకర్షణీయమైన విజువల్ ఎఫెక్ట్‌లను ఆఫర్ చేస్తుంది. రీప్లేస్ ఫీచర్ యూజర్లు వారి రీల్స్‌లోని ఇతర ఎలిమెంట్‌ల సమయం లేదా క్రమాన్ని అంతరాయం కలిగించకుండా ఒక క్లిప్‌ను మరొకదానికి మార్చుకోవడానికి అనుమతిస్తుంది. ఇక కంపెనీ పోస్ట్‌లు, రీల్స్‌పై GIF కామెంట్స్ కూడా ప్రవేశపెట్టింది. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement