Friday, March 29, 2024

ఆలస్యంగా ఇంటర్‌ ఫలితాలు.. మంగళవారం తర్వాతే ప్రకటించే చాన్స్​!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫలితాల విడుదలకు మరో రెండు, మూడు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయి ఫలితాల ప్రకటనకు చేయాల్సిన పనులపై ఇంటర్‌ బోర్డు అధికారులు దృష్టి సారించారు. ఫలితాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఒకటికి రెండుసార్లు మార్కులను, విద్యార్థుల వివరాలను పరిశీలించాలని అధికారులు భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఇంటర్‌ ఫలితాల్లో తప్పిదాలు చోటు చేసుకోవడం, రాజకీయ పార్టీలన్నీ మూకుమ్మడిగా బోర్డుపై దాడి చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో తక్కువ ఉత్తీర్ణత శాతం చోటు చేసుకోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ప్రభుత్వం అందరినీ పాస్‌ మార్కులను ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఇటువంటి పరిస్థితి మళ్లి రాకుండా ఉండేందుకే ముందస్తు చర్యలన్నీ తీసుకుని ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్‌ బోర్డు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటించాలా లేదా వేర్వేరుగా విడుదల చేయాలా అన్న అంశంపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. మంగళవారం తర్వాతే ఫలితాలు విడుదలయ్యే అవకాశముంది. ఇదిలా ఉండగా ఎంసెట్‌కు సంబంధించిన హాల్‌ టికెట్లను జేఎన్‌టీయూ అధికారులు వెబ్‌సైట్‌లో పెట్టారు. ఎంసెట్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడిసిన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌ టికెట్లను పొందవచ్చని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్దన్‌ తెలిపారు. జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష జరుగుతుండగా 18 నుంచి మూడు రోజులపాటు ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి ఎంట్రన్స్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల 65వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement