Wednesday, November 29, 2023

నెట్‌ప్లిక్స్‌లో లాల్‌సింగ్ చ‌డ్డా.. త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్‌కు రెడీ!

ద‌ర్శ‌కుడు అద్వైత్ చందన్ డైరెక్షన్ లో అమెరికన్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ కు రీమేక్‌గా న‌టుడు అమీర్ ఖాన్ న‌టించిన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’. ఈ మూవీలో క‌రీనా క‌పూర్, టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగ‌చైత‌న్య కీల‌క పాత్రల్లో న‌టించారు. ఆగ‌స్ట్ 11 ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను అంతగా మెప్పించ‌లేక‌పోయింది. కాగా, 180 కోట్ల‌తో తెరకెక్కిన ‘లాల్ సింగ్ చడ్డా’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అనుకున్నంత స్తాయిలో క‌లెక్ష‌న్ లు రాబ‌ట్ట‌లేక‌పోయింది.

‘లాల్ సింగ్ చడ్డా’ విడుదలకు ముందు ఆరు నెలల వరకు ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి రాదని ఆమిర్ తెలిపాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌రాజ‌యం పాల‌వ్వ‌డంతో త్వ‌ర‌లో ఓటీటీ బాట ప‌ట్ట‌నున్న‌ట్టు తెలుస్తొంది. లాల్ సింగ్ చ‌డ్డా సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్ర‌ముఖ‌ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ట్టు సినీ వర్గాల స‌మాచారం. ఈ సినిమా వ‌చ్చే నెల (అక్టోబ‌ర్) 20 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement