Tuesday, November 12, 2024

Supreme Court | లడ్డూ వివాదం.. విచారణ రేప‌టికి వాయిదా !

ఆంధ్రప్రభ స్మార్ట్​, హైదరాబాద్​: తిరుప‌తి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. ధర్మాసనం మరో కేసులో బిజీగా ఉన్నందున శుక్రవారం ఉదయం విచారణ చేపట్టనున్నారు. ఓ కేసు విచారణ ఆపి లడ్డూ కేసు విచారించడం భావ్యం కాదని సొలిసిటర్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు తీసుకోవాల్సిందిగా కోరారు. ఎస్ఓ సూచన మేరకు ఈ కేసును శుక్రవారం ఉదయం విచారిస్తామని జస్టిస్ గవాయ్ ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు ద‌ర్యాప్తు వివ‌రాలు సేక‌రించేందుకు కొత్త స‌మ‌యం కావాల‌ని టిటిడి న్యాయ‌వాది కోరడంతో విచార‌ణ రేప‌టికి ధ‌ర్మాస‌నం వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement