Saturday, April 20, 2024

ఖుషీ పోస్ట‌ర్.. కుక్క‌పిల్ల‌తో క్యూట్ గా స‌మంత‌

ఖుషీ మూవీ నుండి పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ లో .హీరో విజయ్‌ దేవరకొండ ఆఫీస్‌కు వెళ్తూ.. టెర్రస్‌పై పెట్‌ను ఎత్తుకొని ఉన్న హీరోయిన్ సమంతకు బై చెప్తున్న స్టిల్‌ ఇప్పుడు నెట్టింట్లో హల్‌ చల్ చేస్తోంది. శివ‌నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఖుషీ. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వస్తున్న ఈ మూవీలో విజయ్‌, సామ్‌ ప్రయాణం సూపర్ కూల్‌గా ఉండబోతున్నట్టు తాజా లుక్‌తో చెబుతున్నాడు డైరెక్టర్‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో స‌చిన్ ఖ‌డేక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, ల‌క్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, కన్నడ యాక్టర్‌ జ‌య‌రాం, శ‌ర‌ణ్య ప్రదీప్‌ కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. ఖుషి నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రానికి హేశమ్‌ అబ్ధుల్‌ వహబ్‌ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement