Friday, April 19, 2024

కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారిలో 99 శాతం మందికి కరోనా..

కుంభమేళాలో పాల్గొని మధ్యప్రదేశ్‌కు తిరిగివచ్చిన వారిలో 99 శాతం మందికి కొవిడ్‌19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళా కొవిడ్‌ సూపర్ స్ప్రెడర్‌ అనే ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇందులో పాల్గొని వచ్చిన 61 మంది యాత్రికులకు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా 60 మందికి పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఈ పరిణామం అధికారులకు కలవరం కలిగిస్తోంది. కుంభమేళాలో పాల్గొని రాష్ట్రానికి తిరిగివచ్చిన వారిలో మరికొందరిని ఇంకా గుర్తించకపోవడంతో వారి ద్వారా వైరస్ సంక్రమణపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక కొవిడ్‌-19 కేసులు ప్రబలమవుతుండటంతో కుంభమేళా నుంచి తిరిగివచ్చిన యాత్రికులు 14 రోజులు విధిగా క్వారంటైన్‌లో ఉండాలని పలు రాష్ట్రాలు నిర్ధేశించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement