Friday, December 6, 2024

53వ ఐఎఫ్ ఎఫ్ఐ 2022కి ఎంపికయిన ..కుదీరాం బోస్

మన స్వాతంత్ర్య సమరయోధుల్లో అతి చిన్న వయస్కుడు కుదీరాం బోస్. చరిత్ర పుస్తకాల్లో ఈయన ఎక్కువగా కనపడరు. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ తదితలు కీలక పాత్రలను పోషించారు. 53వ ఐఎఫ్ ఎఫ్ఐ2022కి ఎంపికయింది కుదీరాం బోస్ చిత్రం. స్వాతంత్ర్య సమరయోధుడు కుదీరాం బోస్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిందిఈ పాన్ ఇండియా చిత్రం గోవాలో జరిగే ఐఎఫ్ఎఫ్ఐ వేడుకల్లో ‘ఆర్ఆర్ఆర్’, ‘అఖండ’, ‘సినిమా బండి’ వంటి తెలుగు చిత్రాలతో పాటు ‘కుదీరాం బోస్’ సినిమాను కూడా ప్రదర్శిస్తారు. ఈ బయోపిక్ కు విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించగా… గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించింది. రాకేశ్ జాగర్లమూడి లీడ్ రోల్ ను పోషించారు. మణిశర్మ సంగీతాన్ని అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement