Thursday, April 25, 2024

19న అమెరికా వెళ్ల‌నున్న‌ కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈనెల 19వ తేదీన అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఈనెల 26వ తేదీ వరకూ కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తారు. వారం రోజుల పాటు అమెరికా పర్యటనలో ఉంటారు. మంత్రి కేటీఆర్ తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటన కొనసాగనుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను తేవాలన్న లక్ష్యంతోనే కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళుతున్నారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించి పారిశ్రామిక వేత్తలను, ఎన్‌ఆర్ఐలను కలుస్తారు. వారితో ప్రత్యేకంగా సమావేశమై తెలంగాణలో పెట్టుబడుల విషయమై చర్చిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement