Sunday, April 14, 2024

కృష్ణంరాజు మృతి పట్ల పవన్‌ కల్యాణ్‌ దిగ్భ్రాంతి

ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సినీ పరిశ్రమంలో ప్రత్యేక పంథా కలిగిన నటుడు కృష్ణంరాజు అని కొనియాడారు. భక్త కన్నప్పలో రెబెల్‌స్టార్ అభినయం ప్రత్యేకమైన దని పేర్కొన్నారు. నటుడు, నిర్మాత, రాజకీయనేతగా మన్ననలు అందుకున్నారని, ప్రజాజీవితంలో ఎంతో హుందాగా మెలిగారని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement