Friday, April 19, 2024

కోన‌సీమ థ‌గ్స్..

ప్రముఖ డాన్స్‌ మాస్టర్‌ బృందా గోపాల్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్స్‌’, ఈ సినిమా తెలుగులో ‘కోనసీమ థగ్స్‌’ పేరుతో భారీ చిత్రాల నిర్మాత, పంపిణోదారు శిబు తమీన్స్‌ కుమార్తె రియా షిబు సమర్పిస్తూ . జీయో స్టూడియోస్‌ తో కలిసి నిర్మిస్తున్నారు. తమీన్స్‌ కుమారుడు హ్రిదు హరూన్‌ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్‌ కె సురేష్‌, మునిష్కంత్‌, శరత్‌ అప్పనీ, అనస్వర రాజన్‌ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

ఇటీవల విడుదలైన థగ్స్‌ క్యారెక్టర్స్‌ పరిచయ వీడియో మంచి క్రేజ్‌ ఏర్పరచింది. అంచనాలు రెట్టింపు చేసింది. ఇప్పుడు టీ-ం చిత్ర -టైలర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. డిజిటల్‌ -టైలర్‌ ను విజయ్‌ సేతుపతి, దుల్కర్‌ సల్మాన్‌, ఆర్య, అనిరుధ్‌ , కీర్తి సురేష్‌ విడుదల చేశారు. కోనసీమ నేపథ్యంలో జరిగే ఈ చిత్రం ప్రేక్షకులకు ఆసక్తిని ఇవ్వబోతోంది. శామ్‌ సి ఎస్‌ సంగీతం -టైలర్‌ లోని ఇం-టె-న్సిటీ-నీ మరింత పెంచేలా ఉండగా, ప్రీయేష్‌ గురుస్వామి సినిమాటోగ్రఫీ అందించారు. ప్రధానంగా దర్శకురాలిగా మారిన కోరియోగ్రఫర్‌ బృందా టేకింగ్‌ ఆకట్టుకుంటుంది. త్వరలో భారీ స్థాయిలో విడుదలకు సిద్దం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement