Tuesday, April 23, 2024

కేసీఆర్ కుటుంబంలో కలహాలు? బీజేపీ తరుపున పోటీ ?

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరాసను గద్దెదించాలంటే బీజేపీకే సాధ్యంమవుతుందన్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్ నుంచి నన్ను పోటీ చేయమని బిజెపి కోరుతుందన్నారు. కానీ నేని ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మరో వైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలి లో కుటుంబ కలహాలు ఉన్నాయన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి. మొదట కేటీఆర్ సీఎం అవుతున్నాడని ఎమ్మెల్యేలు, మంత్రులతో కేసీఆరే మాట్లాడిపించాడని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఆ తరువాత కుటుంబ సభ్యులే కేటీఆర్ ను సీఎం అవ్వకుండా అడ్డుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ పాలనలో సంతోష్, హరీష్ రావు, కవితల హవా నడుస్తుందని అదే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే సంతోష్, హరీష్ రావు. కవితలు సైడ్ అవుతారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి. మరోవైపు సాగర్ ఉపఎన్నికల షెడ్యూల్ రావటంతో అన్ని పార్టీలు కూడా ప్రభుత్వ పనితీరును ప్రజల ముందు పెట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement