Monday, December 4, 2023

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం నుండి.. కోలో కోలో సాంగ్ రిలీజ్

మారేడుమిల్లి ప్రాంతంలోని గిరిజనుల జీవితాల్లో మార్పు తీసుకుని రావడం కోసం హీరో చేసే పోరాటమే ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం కథ. కాగా ఈ చిత్రం నుండి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.. కోలో కోలో కోయిల .. కొమ్మా రెమ్మా ఊయల, రేలా రేలా ఎన్నెలా … జలజలా వాగులా’ అంటూ ఈ పాట సాగుతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, జావేదే అలీ – మోహన భోగరాజు ఆలపించారు. బీట్ . శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బాగున్నాయి. గిరిజనుల ఆచారాలకు .. వాళ్లు సంబరాలు జరుపుకునే తీరుకు చాలా దగ్గరగా ఈ పాట సాగుతూ ఆకట్టుకుంటుంది. హీరో అల్లరి నరేశ్ – ఆనంది జంటగా తెరకెక్కింది. రాజేశ్ దండ నిర్మాణంలో ఏఆర్. మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, కొంతకాలంగా సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తోంది. నిజానికి ఈ నెల 18వ తేదీన విడుదల కావలసిన ఈ సినిమాను 25వ తేదీకి వాయిదా వేశారు. చివరిగా అదే డేట్ ను ఫైనల్ చేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement