Friday, December 1, 2023

నెలకి రూ.2.76 లక్షలు అద్దె చెల్లిస్తోన్న‌.. కోహ్లీ.. అనుష్క‌లు

ముంబ‌య జుహూ ప్రాంతంలోని ఓ ల‌గ్జ‌రీ అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటున్నారు విరాట్ కోహ్లీ.. అనుష్క‌శ‌ర్మ‌లు. కాగా వీరు ఆ ఫ్లాట్‌కు చెల్లిస్తున్న అద్దె ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. సముద్రానికి ఎదురుగా ఉన్న ఆ ఇంటికి విరుష్క జంట ఏకంగా రూ.2.76 లక్షలు అద్దె కింద చెల్లిస్తోందంట. గత నెల అక్టోబర్ 17న రిజిస్ట్రేషన్ సమయంలో విరాట్ కోహ్లీ దంపతులు ఆ ఫ్లాట్ కోసం రూ.7.50 లక్షల డిపాజిట్ కూడా చెల్లించినట్లు బాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.

- Advertisement -
   

విరాట్ కోహ్లీ ఉంటున్న ఆ లగ్జరీ అపార్ట్మెంట్ వడోదర రాజ కుటుంబానికి చెందిన మాజీ క్రికెటర్ సమర్జిత్ సింగ్ గైక్వాడ్ కు చెందినదిగా తెలుస్తోంది. మరోవైపు విరుష్క జంట ఈ ఏడాది సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లాలో ఓ ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. అలీబాగ్‌లోని జిరాద్‌ గ్రామ శివారులో రూ 19.24 కోట్లతో ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్‌కూడా అయినట్లుగా సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement