Thursday, April 25, 2024

ఎమ్మెల్సీ కౌంటింగ్.. కోదండ‌రాం ఔట్

నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటి చేసిన ప్రొ.కోదండరాం ఎలిమినేష‌న్ అయ్యారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. తక్కవ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో మొద‌టి నుండి కోదండరాంకు మెజారిటీ ఓట్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ, మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఆయ‌న వెనుక‌బ‌డ‌టంతో ఎలిమినేష‌న్ కు వెళ్లారు. నాలుగో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్య‌ర్థి ప్రేమేంద‌ర్ రెడ్డికి వ‌చ్చిన ద్వితీయ ప్రాధాన్య‌త ఓట్ల‌లోనూ కోదండ‌రాంకు భారీగా ఓట్లు వ‌చ్చినా… మొద‌టి, రెండో స్థానాల్లో ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, తీన్మార్ మ‌ల్ల‌న్న‌లు నిలిచారు. దీంతో కోదండ‌రాం ఎలిమినేష‌న్ కు వెళ్లారు. దీంతో కోదండారం కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయారు. మరోవైపు విజయం సాధించడానికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నమధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement