Wednesday, April 17, 2024

జూన్ నుంచి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. ఎంటో తెలుసుకోండి

మరికొద్ది రోజుల్లో మే నెల అయిపోయి జూన్ ప్రారంభం కాబోతోంది. మ‌రి ఈ కొత్త నెల నుంచి మారుతున్న అనేక విషయాలు సామాన్యుల ప్లాన్లను, నెలవారీ బడ్జెట్ ను ఎలా ప్రభావితం చేస్తాయో తప్పక తెలుసుకోవాల్సిందే. అయితే జూన్ నుంచి మారే రూల్స్ ఎంటియనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తగ్గనున్న సీఎన్​జీ ధర..

- Advertisement -

దేశంలోని చమురు కంపెనీలు ప్రతినెల మెుదటి తేదీన లేదా మెుదటి వారంలో సీఎన్జీ, పైప్డ్ గ్యాస్ ధరల్లో మార్పులు చేస్తుంటాయి. ఢిల్లీ, ముంబైలలో నెల మొదటి వారంలో పెట్రోలియం కంపెనీలు గ్యాస్ ధరను మారుస్తాయి. వీటి ధరలను నిర్ణయించే ఫార్ములాలో చేసిన మార్పుల కారణంగా ఏప్రిల్ నెలలో రేట్లు తగ్గాయి. జూన్‌లో CNG-PNG ధరలు మారే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈవీ ధరలు..

దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు జూన్ 1, 2023 నుంచి ఖరీదైనవి కానున్నాయి. మే 21న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ FAME-II సబ్సిడీ మొత్తాన్ని kWhకి రూ.10,000కి కుదించింది. గతంలో kWhకి రూ.15,000 తగ్గింపును అందించింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధర సుమారు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు పెరుగుతుందని వాహన రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement