Thursday, February 2, 2023

స‌ల్మాన్ కిసీ కా బాయ్ కిసీ కా జాన్.. టీజ‌ర్ రిలీజ్

కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్ టీజ‌ర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ చిత్రాన్ని ఫర్హాద్‌ సమ్‌జీ తెర‌కెక్కిస్తున్నాడు.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది..టాలీవుడ్ హీరో వెంకటేశ్‌ కీ రోల్‌ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, భాగ్యశ్రీ, భూమికా చావ్లా, మాళవికా శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచరణ్ అతిథి పాత్రలో మెరవబోతున్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఒకరోజు ముందే జనవరి 25న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్‌. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్‌ పోస్టర్‌ కూడా విడుదల చేశారు.కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌ చిత్రాన్ని ముంబై, హైదరాబాద్‌, లడఖ్‌ లొకేషన్లలో షూట్ చేశారు. హోంబ్యానర్‌ సల్మాన్ ఖాన్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌లో సల్మాన్ ఖాన్ తెరకెక్కిస్తున్నాడు. ముందుగా ఇచ్చిన అప్‌డేట్ ప్రకారం ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement