Thursday, April 25, 2024

కియా కొత్త ఎడిషన్‌.. సొనెట్‌ ఎక్స్‌-లైన్‌

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా సరికొత్త మోడల్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సొనెట్‌ ఎక్స్‌-లైన్‌ పేరిట విడుదల చేస్తున్న నూతన మోడల్‌ పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్లలో లభ్యమవుతుంది. దీని ధర వరుసగా రూ.13.39 లక్షలు, రూ. 13.39 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌ ధర) ఉంటుందని పేర్కొంది. సొనెట్‌ ఎక్స్‌ లైన్‌ ఆధునిక ఫీచర్లతో ముస్తాబైంది. గ్లాస్‌ బ్లాక్‌ రేడియేటర్‌ గ్రిల్‌, పియానో బ్లాక్‌ ఫ్రంట్‌, రేర్‌ స్కిడ్‌ ప్లేట్స్‌, పియానో బ్లాక్‌ ఓఆర్‌వీఎమ్స్‌, సిల్వర్‌ బ్రేక్‌ క్యాలిపర్స్‌తో డ్యూయల్‌ టన్‌ అలాయ్‌ వీల్స్‌ దీని ప్రత్యేకతలు. లోపలివైపు ఫీచర్లను గమనిస్తే, ఎక్స్‌లైన్‌ లోగోలతో స్పోర్ట్‌ ్స సీట్స్‌, ఫ్లాట్‌ బాటమ్‌ స్టీరింగ్‌, బ్లాక్‌ హెడ్‌లైనర్‌లున్నాయి. జీటీఎక్స్‌ ప్లస్‌ ఆధారిత వేరియంట్‌గా సొనెట్‌ ఎక్స్‌ లైన్‌ ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement